పద్మారావునగర్, వెలుగు: రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేన మెజార్టీ సీట్లు సాధించే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్, సినీ హీరో తనీశ్ ధీమా వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఆయన సమక్షంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా తనీశ్ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జనసేత సత్తా చాటిందని, వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమితో కలిసి వెళ్లాలా లేదా ఒంటరిగా పోటీ చేయాలా అనే అంశంపై అధినేత పవన్ కల్యాణ్ తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
